
మున్సిపల్ చైర్మన్ రఫాని నీ కలసి
స్మశాన వాటికలో పిచ్చి మొక్కలు తొలగించాలని కోరిన
టీడీపీ నాయకులు
చిలకలూరిపేట: పట్టణ పురపాలక సంఘం నందు ఈనెల 20-04-2025వ తారీకు జరగబోవు క్రైస్తవ సమాజానికి ప్రధానమైన పండుగ ఈస్టర్ పండుగ సందర్భంగా ప్రతి క్రైస్తవుడు వారి యొక్క పూర్వీకుల సమాధులు శుభ్రపరచుకొనుటకు సాంప్రదాయంగా ఉన్నందున పట్టణంలోని ఐదు స్మశాన వాటికలు అపరిశుభ్రంగా ఉన్నటువంటి స్మశాన వాటికలను శుభ్రం చేయవలసినదిగా మరియు స్మశాన వాటిక లోని బోరింగ్ లను రిపేర్ చేయవలసినదిగా మున్సిపల్ చైర్మన్ షేక్. రఫానీ కి పట్టణ తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి మద్దు మాల రవి, కొండ వీరయ్య, గట్టుపల్లి మాణిక్యరావు, శానం శ్రీనివాసరావు, కొండేపాటి రమేష్ బాబు, తాడి మల్ల చందు.తదితరులు కోరారు
