
మున్సిపల్ చైర్మెన్ షేక్ రఫానీ నీ అభినందించిన..అచ్చుకోలు మురళి.. మాదసు భాను ప్రసాద్ లు
చిలకలూరిపేట : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని నీ సీనియర్ రాజకీయ నాయకులు అచ్చుకోలుమురళి
.లోకసత్తా నాయకులు మాదాసు బాను ప్రసాద్. అందేలా శౌరి లు మర్యాద పూర్వకంగా కలసి శాలవ తో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల హర్యానాలోని, గురుగ్రామ్ లో భారత పార్లమెంటు హర్యానా ప్రభుత్వ సహకారంతో దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పట్టణ స్థానిక సంస్థల చైర్మన్ లతో”రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, దేశ నిర్మాణంలో పట్టణ స్థానిక సంస్థల పాత్ర” అంశంపై అవగాహన కల్పించడం కోసం జరుగుతున్న రెండు రోజుల జాతీయ స్థాయి సమావేశాలలో మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఆ సమావేశాలలో పాల్గొన్న ఆయనకు.
స్థానిక సంస్థల బలోపేతం అంశం పై మాట్లాడేందుకు హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వేదిక అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చైర్మెన్ షేక్ రఫానీ స్థానిక సంస్థల బలోపేతం పై విలువైన సూచనలను, ఆ వేదిక ద్వారం ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ కే గర్వకారణమని కొనియాడారు..
పట్టణ, గ్రామ పంచాయతీలు మౌలిక వసతులు సదుపాయాల కల్పన కోసం ఆయన చేసిన పలు విలువైన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రాధాన్యతను ఇచ్చి కార్యరూపంలోకి తీసుకువస్తే స్థానిక సంస్థలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పలువురు పుర ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలియజేశారు.
