
మున్సిపల్ టెండర్లు, వేలం వాయిదా
తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించాల్సిన వినాయక సాగర్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, దుకాణాల వేలం ను అనివార్య కారణాల వలన వాయిదా వేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని 1) వినాయక సాగర్ పార్కు నందు ప్రవేశ రుసుము వసూలు, పార్కింగ్ రుసుము వసూలు చేసుకొనే హక్కులు కొరకు, 2) వినాయక సాగర్ పార్కులోని గేమ్ జోన్ నిర్వహణకు, 3) కరకంబాడి మెయిన్ రోడ్డులో బొంతాలమ్మ గుడి వద్ద గల షాపింగ్ కాంప్లెక్స్ లోని రెండవ అంతస్తు ప్రస్తుతము ఉన్న యధాస్థితిలో 4) ఇందిరా మైదానము లో గల స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు క్రీడాకారుల నుండి నెలసరి రుసుములు వసూలు చేసుకొనే హక్కు కొరకు సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలం ను జూలై 9వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణముల వలన వేలం ను వాయిదా వేస్తున్నామని తెలిపారు. తదుపరి సీల్డ్ టెండరు, బహిరంగ వేలం తేదీలను త్వరలో తెలియజేస్తామని కమిషనర్ ఆ ప్రకటనలో తెలిపారు.
