
భారత సైన్యానికి సెల్యూట్ చేసి మద్దతు తెలిపిన ముస్లిం సోదరులు ….
పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్లకార్డులు ప్రదర్శించి ఇండియన్ ఆర్మీ సైన్యానికి మద్దతు తెలిపారు..
ఉగ్ర దాడిలో మరణించిన వీర జవాన్లకు నివాళులర్పించారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు…
జయహో ఆపరేషన్ సింధూర్
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముస్లింల మత గురువు మౌలానా అబ్దుల్ రహీయ్ గారు మాట్లాడారు…
హుజూర్ నగర్ పట్టణంలో
ముస్లిం సోదరులు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత సైన్యం భీకర పోరు చేసి ఉగ్రవాదులు అంత ముగించిన మన భారత సైనికులకు
సంఘీభావం మద్దతు తెలియజేసి
సెల్యూట్ చేశారు….
పహల్గాం అటాక్‌కు రివేంజ్ తీర్చుకుంది భారత్. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 టెర్రరిస్ట్ క్యాంపులపై సక్సెస్‌ఫుల్‌గా అటాక్స్ చేసింది. ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు చేసి జైషే మహ్మద్, లష్కరే తొయిబా లాంటి టెర్రర్ సంస్థలను చావుదెబ్బ తీసింది. భారత్ పేరు చెబితే గజగజ వణికేలా చేసింది. మెరుపు దాడులతో వందలాది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రతా బలగాలు….
🇮🇳 ఇదీ భారత్ అంటే ..
భారత్ తన మెసేజ్ ఏంటో గట్టిగా చాటిచెప్పిందని ఒక దేశంగా మనమేంటో అందరికీ సుస్పష్టం చేశామంటూ కల్నల్ సోఫియా ఖురేషి,
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ను ఆపరేషన్ సిందూర్ గురించి భద్రతా బలగాలకు చెందిన ఇద్దరు మహిళలు గురిపెట్టి ఉగ్ర స్థావరాలపై జరిపిన క్లిష్టమైన ఆపరేషన్ గురించి సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ దేశ ప్రజలకు చక్కగా వివరించారు.ఇందులో సోఫియా ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి. వ్యోమిక సిక్కు వర్గానికి చెందిన వారు. వీళ్లతో పాటు అదే వేదిక మీద పాల్గొన్న విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఒక కశ్మీరీ పండిట్ కావడం విశేషం.అందుకే పహల్గాంలో టెర్రరిస్టులు మతం అడిగి మరీ కాల్చిచంపడాన్ని ఎత్తిచూపుతూ.. ఇండియాలో ఐక్యతను చాటిచెప్పేలా ఈ నిర్ణయం నిదర్శనమని వారన్నారు…
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మత పెద్దలు ఎండి అజీజ్ పాషా, షేక్ మన్సూర్ అలీ, ఎంఏ అబ్దుల్ మజీద్ భాయ్, బిక్కన్ సాహెబ్, నవాబ్ జానీ, ఎస్డి మున్న , నయీమ్ భాయ్,మిల్లు రహీం, రహమతుల్లా,యూసఫ్,మోయిన్
నాగుల్ మీరా,సద్దాం,జానీ
సో హెల్, అక్బర్ భాయ్,ఖయ్యూం భాయ్, తదితరులు పాల్గొన్నారు
