కులవృత్తుల అభివృద్ధిలో నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయి

TEJA NEWS

కులవృత్తుల అభివృద్ధిలో నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయి: బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ….
కుత్బుల్లాపూర్ మండల్ స్వర్ణకార సంఘం నూతన కమిటీ సభ్యులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి స్వర్ణకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి రోజు నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుల వృత్తుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ వివిధ సంక్షేమ పథకాలతో కులవృత్తులపై ఆధారపడి ఉన్న వారికి చేయూతనిస్తూ ఆదుకోవడం జరిగిందని, కులవృత్తుల అభివృద్ధికి పాటుపడిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఈ క్రమంలోనే గత 12 ఏళ్ల కాలంలో స్వర్ణ కారులతోపాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశామని, రానున్న రోజుల్లో కూడా కులవృత్తుల అభివృద్ధిలో నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏవీ శేషాచారి, నూతన అధ్యక్షులు చొల్లేటి శ్రీనివాస్ చారి, ప్రధాన కార్యదర్శి ఎస్. నారాయణ చారి, కోశాధికారి శ్రీరామోజు మురళీధర్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వెంకటరామయ్య చారి, సలహాదారులు గుండవెల్లి నాగేశ్వర్ చారి, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్ చారి, ఉప సంయుక్త కార్యదర్శి కృష్ణ చారి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top