TEJA NEWS

మార్క్ శంకర్ పేరుమీద అన్నదానం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. కుమారుడు ప్రమాదం నుంచి బయటపడటంతో పవన్ భార్య అన్నా లెజినోవా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకున్నారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భోజనానికి రూ. 17 లక్షలు విరాళంగా అందజేశారు.