
నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంకల్ప రూపం..
కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం సాకారమవుతున్న తరుణం
అత్యంత ముఖ్యమైన రహదారి, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సంకల్పం, కృషికి ప్రతి రూపం.. కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి నిర్మాణం నేడు జరగబోతోంది. ఇప్పటికే అన్ని అనుమతులు, నిధులు మంజూరయ్యి.. నేడు భూమి పూజ కార్యక్రమం జరగనుంది.
సాయంత్రం 5 గంటలకు..49.92 కి. మీ మేర నాలుగు వరుసలుగా అభివృద్ధి కోసం రూ. 881.61 కోట్లతో భూమి పూజ జరగనుంది.
ప్రధాన నగరాలకు ప్రధాన రహదారులకు కనెక్టివిటీగా ఉండి, అభివృద్ధికి నోచుకోక, ప్రమాదాలకి నెలవుగా ఇబ్బందికరంగా ఉన్న ఈ రహదారిని.. జాతీయ రహదారిగా విస్తరించేందుకు మొదటినుంచి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అలుపెరగని కృషి చేశారు. దీంతో కేంద్రం దీన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. తర్వాత విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ, భూసేకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది, కాంట్రాక్టర్లు ఎంపిక చేసి టెండర్లు కూడా పూర్తి చేసి… అన్ని ప్రక్రియలను పూర్తి చేసింది.
ఈరోజు భూమి పూజ చేసి, అత్యంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు, పల్నాడు ప్రజలకు మేలు చేసేందుకు.. అడుగులు పడుతున్నాయి.
