TEJA NEWS

మహిళా ఆర్థికాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా పొదుపు సంఘాల సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గండిమైసమ్మ పొదుపు సంఘం నకు 20 లక్షలు, సరోజిని మహిళా పొదుపు సంఘం నకు 18 లక్షలు, తిరుపతి పొదుపు సంఘం నకు 17 లక్షల రూపాయల చొప్పున మంజూరైన రుణ పత్రాలను ఎమ్మెల్యే పొదుపు సంఘం సభ్యులకు అందజేశారు.

అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, మహిళా పొదుపు సంఘాల సభ్యులు అందరూ ఐకమత్యంతో ఉండి కుటీర పరిశ్రమలను ఏర్పాటుచేసి ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. తద్వారా వారి కుటుంబాలే కాక, రాష్ట్రం, దేశం ఆర్థికాభివృద్ధి చెందుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కుంట సిద్ధిరాములు, పొదుపు సంఘాల సభ్యులు ఎం.పద్మ, అపర్ణ, దుర్గా దేవి, అంజలి, అన్నపూర్ణ, ఆండాలు తదితరులు పాల్గొన్నారు.