TEJA NEWS

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టల్ విడుదల

అన్ని రంగా ల కార్మికులు సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపు

వనపర్తి
మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పోస్టర్లను గురువారం జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం. రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక ,ప్రజావ్యతిరేక విధానాలను వెనక్కి తగ్గిందుకే భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు 2025 మే 20 న,దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్కేయం) సంపూర్ణ మద్దతును ప్రకటించిందని తెలిపారు. సిపిఎం సిపిఐ వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, కార్మిక వర్గం మే 20న జరిగే సమ్మెకు సమాయత్తం కావాలని సంఘటిత, అసంఘటితరంగా కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులందరూ సమస్త కార్మికులు ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన ఐదు శాతం గా ఉన్న పెట్టుబడిదారుల వద్ద 70 శాతం ఆదాయం పోగుపడగా, 50% ప్రజల వద్ద కేవలం 3 శాతం మాత్రమే ఉండి పూట గడవడమే కష్టంగా మారిందన్నారు.

ఈ కాలంలో పేదరికం 17 శాతానికి పెరిగిందని కార్మికుల జీవన స్థితిగతులు దిగజారింది .కాబట్టి కనీస వేతనాలు నెలకు 26,000 పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తుండగా పెట్టుబడిదారుల ప్రయోజనం కోసం నేషనల్ ఫ్లోర్ లేబుల్ మినిమం వేజ్ ను మోడీ ప్రభుత్వం రోజుకు 178/- రూపాయలుగా నిర్ణయించడం సరైనది కాదన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిలింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడులను అమలు చేస్తున్నారు. 12 గంటల పనిని చట్టబద్ధం చేస్తున్నారు. సామాజిక భద్రతా పథకాల కు నిధులు తగ్గిస్తున్నారు. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ కఠిన తరం చేసి ,కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు కూడా బరితెగించారు. ఉమ్మడి బె ర సారాల హక్కు తొలగించి వాటిని భారత్ న్యాయ సంహిత చట్టం ద్వారా నాన్ బెయిలబుల్ కేసులుగా మార్చింది . పని ప్రదేశాల్లో గేటు మీటింగులు, కరపత్రాల పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా, రాజ్యాంగం కల్పించిన హక్కులన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం జరిగిందని, కార్మిక శాఖను మధ్యవర్తిత్వం విభాగంగా మార్చడం జరిగిందని ,దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు బిజెపి ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, మెప్మా ఆర్పీలు, ఐకెపి వివోఏలు, కస్తూర్బా వర్కర్స్ తదితర స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తించకుండా వెట్టిచాకి చేసే విధంగా లేబర్ కోడులను అమలు చేసేందుకు సిద్ధమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏం
రాజు ,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, జిల్లా సహాయ కార్యదర్శులు ఆర్ . ఎన్. రమేష్, కె సునీత ,కోశాధికారి శారద, జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు , బి కవిత ,శ్యామల, బి నారాయణమ్మ, జ్యోతి, బాల కిష్టమ్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు