
తుడ”ను పరుగులు పెట్టిద్దాం!
- టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో తుడ కొత్త చైర్మన్ డాలర్స్
- తిరుపతి: గతంలోలాగా కాకుండా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడ)ను అన్ని విధాలా అందరి సహకారంతో పరుగులు పెట్టించి సామాన్యులకు కూడా సహాయం అందేలా చేయాలన్నదే తన ఆశయం అని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడ) కొత్త చైర్మన్ గా నియమితులైన డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆశయాలు సాధించే దిశగా ఎంపికైన తుడ చైర్మన్ దివాకర్ రెడ్డి పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. వారిలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, తుడ మాజీ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, టీడీపీ నేత అన్నా రామచంద్ర యాదవ్ బ్రదర్స్, జనసేన సీనియర్ నేత డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆర్.సి.మునికృష్ణ, మాజీ సర్పంచ్ సి.ఆర్. రాజన్, బీజేపీ అధికార ప్రతినిధి గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, బీజేపీ నేత పి. నవీన్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ మాజీ యూనియన్ నేత బుల్లెట్ రమణ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నూతన తుడ చైర్మన్ డాలర్స్ దివాకర్ మీడియాతో మాట్లాడుతూ తన లక్ష్యం… కలిసి పని చేయడమే అని వెల్లడించారు. ఆ దిశగా ఐక్యతతో అడుగులు వేద్దాం అని కూటమి పార్టీ ల నేతలకు విన్నావించ్చారు.
గత ఐదేళ్లుగా తుడా తిరోగమనం చెందిందని….
తుడాభివృద్ధి లక్ష్యంగా అందరినీ కలుపుకొని ముందడుగు వేస్తానని పేర్కొన్నారు.
