
తుడా”ను కొత్త పుంతలు తొక్కిస్తా
** కొత్త చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి స్పస్టీకరణ
తిరుపతి : ప్రపంచం యావత్తు గుర్తించే తిరుపతి నగరంలో అభివృద్ధి దేశాలకు ధీటుగా తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(తుడా )ని తీర్చిదిద్ది, తద్వారా ప్రజలకు సౌకర్యాలు, ప్రభుత్వానికి ఆదాయం సమాకూరెలా కొత్త పుంతలు తొక్కిస్థానని తుడ కొత్త చైర్మన్ డాక్టర్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తుడా కొత్త చైర్మన్ గా నియామకం అయిన ఆయన బుధవారం సాయంత్రం తుడా మైదానంలో పదవీ ప్రమాణం చేశారు. అంతకుముందు ఆయన తిరుపతి రూరల్ పెరుమాళ్లపల్లి నుంచి సుమారు 15 కి. మీ మేర రోడ్ షో, ప్రదర్శన చేపట్టారు. అనంతరం దివాకర్ రెడ్డికి పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శాప్ చైర్మన్ రవినాయుడు, బీజేపీ సీనియర్ నేతలు నవీన్ కుమార్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ తదితరులు ఉన్నారు.
తుడా చైర్మన్ గా నియమితులైన డాలర్ దివాకర్ రెడ్డికి చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రగిరి నియోజకవర్గం, పెరుమాళ్ళపల్లెకు చెందిన డాలర్ దివాకర్ రెడ్డిని తుడా చైర్మన్ గా నియమిస్తూ… ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే..
ఈ నేపథ్యంలో తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాలర్ దివాకర్ రెడ్డిని..,, ఆయన సొంతూరు పెరుమాళ్ళ పల్లెల్లోని డాలర్ నివాసంలో పుష్పగుచ్చాలందించి.., అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు.
