Spread the love

న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో ఘనంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ముక్తర్ అలీ పాల్గొనగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ వారిని ముస్లిం సోదరులు షేక్ ఆసిఫ్, ఖలీద్, షబీర్, సమీర్, మీర్జా బేగ్, రసీదా మరికొందరు ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగినది అనంతరం వాళ్ళందరూ పాల్గొని నమాజ్, ఉపవాస విరమణ చేసి పళ్ళను స్వీకరించి పేద విద్యార్థిని విద్యార్థులకు భోజనం అందించినారు ప్రముఖ మీడియా రిపోర్టర్ ఆలీ సత్కరించడం జరిగింది. ముక్తర్ ఆలీ మరికొందరు ముస్లిం సోదరులు మాట్లాడుతూ సంస్థ చేస్తున్న కార్యక్రమాలకి ఎంతో ఆకర్షణవంతులైనాము గత నాలుగు సంవత్సరాలుగా ముస్లిమ్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తుండగా న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా రంజాన్ నెల మాసంలో ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు అందించి కుల మతాలకు అతీతంగా అందరికీ మానవతము ఆదర్శనీయంగా మన దేశ ఐక్యమత్యమే లక్ష్యంగా ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులు ఆదర్శంగా నిలవాలని మనం ఉన్నత స్థానానికి వెళ్లి కుల మతాలకి అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని దానికి గాను సాయి వినయ్ కుమార్, స్వామి వివేకానంద చెప్పినట్టు ప్రేమ,నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఓడించలేదు అన్న మాటలను ఎంతగానో ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రశంసిస్తూ కార్యక్రమం నిర్వహించిన సంస్థ సభ్యులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసించారు.