
కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన కొంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ క్రిష్ణారెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కొంపల్లి మున్సిపల్ నూతన కమిషనర్ క్రిష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ నూతన కమిషనర్ కి శుభాకాంక్షలు తెలియజేసి..
విధి నిర్వహణలో ప్రజలకు మరియు కొంపల్లి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు..
ఈ సమావేశంలో కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్,కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్ పాల్గొన్నారు..
