Spread the love

పాతబస్తీ
షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతన ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునికరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం ప్రారంభించారు.
జైన్ సమాజ్ సహకారంతో సుమారు రూ 12 లక్షల నిధులతో ఆధునికరించిన ఈ ల్యాబ్ లో సుమారు 75 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లు ఎన్డీయే కూటమి నేతలతో కలిసి లాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇప్పటికే పశ్చిమ లో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తేవడానికి షేక్ రాజా సాహెబ్ వైద్యులు కృషి చేయాలన్నారు . ల్యాబ్ లోని యంత్రాల పనితీరు అడిగి తెలుసుకున్నారు.


ప్రజలందరూ ప్రభుత్వాసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఆధునీకరణకు నిధులు సమకూర్చిన జైన్ సమాజ్ వారిని ఎమ్మెల్యే అభినందించారు.
కార్యక్రమంలో జైన్ సమాజ్ సెక్రెటరీ పన్నాలాల్, కుందన్ మల్ గాంధి, ప్రకాష్ మెహతా, నీలేష్ కుమార్ జైన్, డింపుల్ జైన్, సితార జైన్ ,మహీంద్రా జైన్,
షేక్ రాజా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శాంతి కిరణ్, డాక్టర్ తనూజ, డాక్టర్ బిందు ఎన్డీయే కూటమి నేతలు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవపైలా సురేష్, రౌతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు..