Spread the love

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన లేబర్ సెల్ సభ్యులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నూతన లేబర్ సెల్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు..

అనంతరం నూతనంగా నియమితులైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లేబర్ సెల్ ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కర్కాల ఉపేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లేబర్ సెల్ అధ్యక్షులు కావలి గోపాల్ ముదిరాజ్, మేడ్చల్ నియోజకవర్గం లేబర్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైపేట మల్లేష్ గార్లకు శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

— తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సామాన్య కార్యకర్తలను గుర్తించి.. గుండెలో పెట్టుకుంటుంది అన్నారు..

— మన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు,నాయకునికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందన్నారు..

— నూతనంగా ఎన్నికైన లేబర్ సెల్ సభ్యులు పార్టీ కోసం,ప్రజల కోసం పనిచేయాలన్నారు..

ఈ కార్యక్రమంలో టిపిసిసి లేబర్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ కందాడి సుదర్శన్ రెడ్డి, కొంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, కొంపల్లి మాజీ సర్పంచ్ జిమ్మీ దేవేందర్,ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి,జయబేరి గోపాల్ రెడ్డి,అశోక్ రెడ్డి, కావలి నవీన్ తో పాటు తదితరులు పాల్గొన్నారు..