
న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి వారు కుంగ్ ఫు ఊషు ఫ్రీ సమ్మర్ కోచింగ్
చిలకలూరిపేట సి.ఆర్ క్లబ్ నందు నడుపబడుతున్న న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి గత 9 సం.లుగా ఎంతోమంది విద్యార్ధిని, విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ ఉచితముగా శిక్షణ ఇస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విజయకేతనం ఎగుర విషయం అందరికి విధితమే. అందులో భాగంగా ఈ సమ్మర్ శెలవుల్లో విద్యా మానసిక, శారీరక ధృఢత్వమునకు తోడ్పడే విధంగా మార్షల్ ఆర్ట్స్ మరియు డిఫెన్స్లో ఫ్రీ సమ్మర్ కోచింగ్ క్యాంపును చిలకలూరిపేట సి. ఆర్ క్లబ్ నందు నిర్వహిస్తునా సమ్మర్ కోచింగ్ క్యాంప్ బ్రోచర్ని చిలకలూరిపేట మునిసిపల్ కమీషనర్ శ్రీ పి.శ్రీహరి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. తదుపరి ఈ నెల 12,13,14న కర్నూల్ జిల్లాలో ప్రభుత్వంచే గుర్తించబడిన ఊషు క్రీడా పోటీలలో న్యూ షావోలిన్ కుం అకాడమీ నుండి సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాలలో 17 మంది విద్యా పాల్గొనబోవుచున్నారు. ప్రముఖ నోటరీ, సీనియర్ న్యాయవాది దాసరి చిట్టిబాబు విద్యార్ధులను ప్రత్యేకంగా అభినందించారు. మాస్టర్ బత్తుల విక్రమ్ మాట్లాడుతూ -గతంలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఎంతోమంది విద్యార్థులను విజేత# నిలబెట్టామని, గత తొమ్మిది సంవత్సరాలుగా స్థానిక సి.ఆర్ క్లబ్ వారి సౌజన్యంతో ప్రాంగణంలో మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణకు సంబంధించిన విద్యను ఎంతోమంది విద్యార్థ ఉచితంగా శిక్షణనిస్తూ తీర్చిదిద్దామని తెలియజేశారు. అలాగే ప్రస్తుత పరిస్థితులలో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించాలంటే మార్షల్ ఆర్ట్స్ డిఫెన్స్ లాంటి విద్యలను తప్పనిసరిగా పిల్లలకు నేర్పించాలని తల్లిదండ్రులను మరి చిలకలూరిపేట ప్రాంత ప్రజలను కోరారు. సి.ఆర్. క్లబ్లో న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి వారు యిస్తున్న ఈ సమ్మర్ ఫ్రీకోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరా ప్రతిరోజు ఉదయం 6-7 గంటల వరకు స్థానిక సి.ఆర్ క్లబ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుం తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంజి వీరాంజనేయులు, అన్నలదాసు బుల్లిబాబు, కురె బ్రహ్మయ్య, కాకి ప్రసాదు, సిఆర్ క్లబ్ పెద్దలు గడగొట్టి రజనికాంత్, నర్రా కాళిదా తనుబొద్ది హరిబాబురెడ్డి పాల్గొని విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్న మాస్టర్లను ప్రత్యేకంగా అభినందించా వీరు ఏ కార్యక్రమం చేసినా వారికి తమ సహాయ సహకారాలు వుంటాయని తెలియజేశా ఈ కార్యక్రమంలో అకాడమీ చీఫ్ యస్.కె.దరియావలి, మాస్టర్ యడ్ల సురేష్, పాల నాగరాజు, కొర్రపాటి రాంబాబు, ఇన్స్ట్రక్టర్స్ యస్.కె.రబ్బాని, యం.దుర్గా ప్రసాద్, కె.రాహ బ్లాక్ బెల్టర్స్ సాకేత్, సుధీర్, ఖమృద్దీన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
న్యూ షావోలిన్ కుంగ్ ఫు అకాడమి ఫోన్ 91822 65522 8125 903080
