
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 డివిజన్ (గాజులరామారం) లోని ఆర్‌కే లే ఔట్ కాలనీ లో నూతనంగా నిర్మించిన సిసి రోడ్డును కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి తో కలిసి పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రజాపాలనలో అన్నీ వర్గాల ప్రజా సమస్యలు తీరుస్తూ మన మహానగర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నందుకు కాలనీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో 125 డివిజన్ అధ్యక్షులు లాయక్,శఫి,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు అంజలి యాదవ్ మరియు డివిజన్ ముఖ్య నాయకులు,కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
