
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ మెయిన్ రోడ్డు లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో 10 వ తరగతి చదువుతున్న ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులకు పరీక్షల సన్నదం కోసం పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, పెన్నులు) ను విద్యార్థులకు అందచేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని , మన్యం ప్రజలలో విప్లవ బీజాలు నాటి ప్రజలను చైతన్య పరిచి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచిన మహానుభావుడు అల్లూరి అని, క్షత్రియ యూత్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల సన్నదం కోసం పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, పెన్నులు) అందించడం చాలా గొప్ప విషయం అని, క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులను ప్రత్యేకంగా అభినదిస్తున్నాను అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కొనియాడారు, అదేవిధంగా భారత దేశ స్వాతంత్రము కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అని, అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల చిన్న వయసుల్లోనే మన్యం ప్రజలను కలుపుకుని బ్రిటీషు పాలనను ఎదిరించిన గొప్ప యోధుడని, సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లబిస్తుందని నమ్మి. తెల్లదొరల పైకి విల్లు ఎక్కుపెట్టిన ధీరుడు అని అతి చిన్ని వయసులోనే బ్రిటిషర్లను 2 సంవత్సరాలు కంటిమీద కునుకు లేకుండా చేసి గడగడలాడించిన అల్లూరిని తుపాకులతో కాల్చి చంపుతున్న వందేమాతరం అనే నినాదించిన గొప్ప మహానీయుడు అని, అయన జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయం అని , ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని, ఆయన అడుగు జాడలలో యువత నడవాలని నార్నె శ్రీనివాసరావు గారు పేర్కొన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఈ చక్కటి సదవకాశం ను సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని, మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, సమాజం కు మరింత మంచి పేరు తీసుకురావాలని, మీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కులు సాధించి, ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు విద్యార్థులకు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సాయి కుమార్ వారి సిబ్బంది మరియు క్షత్రియ సేవ సమితి జాయింట్ సెక్రటరీ భూపతిరాజు రామకృష్ణంరాజు, క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులు సుధీర్ వర్మ,, సుధాకర్ రాజు, ప్రశాంత్ వర్మ, గౌతం వర్మ, శివాజీ రాజు తదితరులు పాల్గొన్నారు.
