
స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం సీట్లు కాదు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అదనపు కలెక్టర్కు …… జిల్లా బీసీ సంఘం వినతి
వనపర్తి :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో BC లకు 42% రిజర్వేషన్లు అమలు చెయ్యాలి అని BC సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు కురుమూర్తి ఆధ్వర్యం లో వనపర్తి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు శనివారంవినతి పత్రం అందించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ
ప్రభుత్వం రిజర్వేషండ్లను హక్కుగా ఇవ్వాలి కానీ బిచ్చం ఇచ్చినట్లు ఉండకూడదని అన్నారు,అంతే గాని మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మా పార్టీ మాత్రమే
42% సీట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం చాలా దుర్మార్గం 42% సీట్లు ఇస్తున్నాం దమ్ముంటే టిఆర్ఎస్ పార్టీ బిజెపి పార్టీ కూడా ఇవ్వండి అని చెప్పడం విడ్డూరంగా ఉంది 42% రిజర్వేషన్లను ఇస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంటు కు పంపించి అక్కడ అమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు హక్కుగా రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాము.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ కమిషన్ దగ్గర రిపోర్ట్ తీసుకొని బిసి కాస్ట్ సెన్స్ ఆధా రంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది.
సుప్రీంకోర్టు రాష్ట్రాలలో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ లు మించకూడదని అంటుంది కానీ SC లకు 18% & ST లకు 11% పోతే మిగిలేది 21% అంటే గత ప్రభుత్వంలో అమలైన రిజర్వేషన్ల శాతం 23% ఇప్పుడు అంతకన్నా తక్కువనే వస్తుంది మా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి.
కాబట్టి వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొద్దిగా ఇంట్లో ఉండండి ప్రెసిడెంట్అల్లాడి భగవంతు గౌడ్ , జిల్లా నాయకులు కృష్ణ, బాలరాజు, వెంకటేష్ పట్టణ అధ్యక్షులు ఉందేకోటి అంజి,మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
