
సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నోటీసులు జారీ చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్
సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అడజేయాలని జనవరిలో పోలీసులను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్
పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్ కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసిన కమిషన్
అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, లాఠీ ఛార్జ్ చేయలేదని నివేదికలో పేర్కొన్న పోలీసులు
అసలు స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్ కి ఎలా వస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్
