
అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి.
గిరిజనుల అభివృద్ధి కోసం ఐటిడిఏ అధికారులు కృషి చేయాలి.
తృప్తికి మించిన ఆస్తి ఏమీ లేదు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
అధికారులు ఎంత పని చేసిన వారి చేసిన పనిలో తృప్తి ఉంటే చాలని, కోట్లాది రూపాయలు సంపాదించిన తృప్తికి మించిన ఆస్తి ఏమీ లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.
ఐటీడీఏలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు గిరిజన గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా గ్రామాల ప్రజల సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలిపాలని మంత్రి సీతక్క సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రా అధ్యక్షతన ఐటీడీఏలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొనగా సమావేశంలో సీతక్క మాట్లాడుతూ లోని ఐటీడీఏ లోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో గిరిజన అభివృద్ధి తోడ్పడాలని, గిరిజనుల అభివృద్ధి కోసం చేపట్టిన పనులను నిరంతరం సమీక్ష చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, ఇంజనీరింగ్ శాఖ అధికారులు నిరంతరం గ్రామాలలో పర్యటించాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేస్తూ గిరిజన జీవనశైలిలో మార్పు తీసుకురావాలని కోరారు. తెలిసి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పుడే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. అధికారులు ఎక్కడ పని చేసిన తమ ఇంటి వద్దనే పనిచేస్తున్నామని ఆలోచనతో ముందుకు సాగాలని, మంచి పనులు చేసినప్పుడే ప్రజల మన్ననలు పొందుతారని అన్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారని, ఏజెన్సీ గ్రామాల ప్రజలు అన్ని తట్టుకునే శక్తి ఉన్న కారణంగానే కరోనా లాంటి భయంకరమైన వ్యాధి గిరిజన గ్రామాల ప్రజలకు శోక లేదని తెలిపారు. కోట్ల రూపాయలు సంపాదించిన ఏమి ఉండదని, తృప్తికి మించిన ఆస్తి లేదని అన్నారు. ప్రజల మనల్ని పొందిన అధికారులకు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారని అన్నారు. రానున్న రోజులలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని సూచించారు. ఇప్పటి నుండే ఐటీడీఏ పరిధిలోని ఆరు జిల్లాలో చేపట్టిన పనుల వివరాలను సేకరించి పొందుపరచాలని సీతక్క తెలిపారు.
ఈ సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం, డి డి పోచం, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
