
మియాపూర్ డివిజన్ పరిధిలోని బొల్లారం రోడ్డులో సత్యలక్ష్మి నగర్ కాలనీ వద్ద మంజీర మంచి నీటి పైప్ లైన్ అకస్మాత్తుగా పగిలిపోవడం వలన వెంటనే చేపట్టిన పైప్ లైన్ పునరుద్ధరణ పనులను, జలమండలి అధికారులు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మంజీర పైప్ లైన్ పగిలిపోయిన విషయం తెలియగానే సంఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగినది అని, చాలా సంవత్సరాల క్రితం వేసిన పాత పైపులు అవడం వలన ,వాటి జీవిత కాలం తగ్గడం వలన, కరెంట్ అన్ ,ఆఫ్ చేసే క్రమంలో గల సమయంలో గ్యాస్ వాయువు ఏర్పడి పగిలిపోవడం జరుగుతుంది అని, ఇటువంటి సమస్యలు మళ్ళీ పునరావృతం కాకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటామని, ఇట్టి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతామని, PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా మంజీర పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవడం చాలా దురదృష్టకరం అని, పైప్ లైన్ పగిలిపోవడం మంచినీటి సరఫరా లో ఇబ్బంది ఎదురైనది అని, జలమండలి, GHMC ,ట్రాఫిక్ విభాగం అధికారులు సమన్వయం చేసుకొని పైప్ లైన్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టి, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగినది. పనులలో వేగం పెంచి,నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టి మళ్ళీ పునరావృతం కాకుండా చూడలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు ,
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి చేస్తానని, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి వస్తే పరిష్కరిస్తానని, అన్ని వేళలో అందుబాటులో ఉంటానని PAC చైర్మన్ గాంధీ తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు DGM వెంకటేశ్వర్లు మరియు తదితరులు పాల్గొన్నారు.
