
గురుపౌర్ణమి సందర్బంగా ….
(కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) గురు పౌర్ణమి పర్వదినం సందర్బంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరధిలోని బాచుపల్లి KRCR కాలనీ లో ఉన్న శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, NMC అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బల్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
