
కొనసాగుతున్న టీడీపీ ఇంటింటి పర్యటనలు
తిరుపతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న “సూపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేతల ఇంటింటి పర్యటనలు తిరుపతిలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్ టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు
గొల్ల నరసింహ యాదవ్, రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్ పర్సన్ కమ్ మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మల ఆధ్వర్యంలో 30వ డివిజన్ నెహ్రు నగర్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేస్తూ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో గానీ, తిరుపతిలో గానీ అభివృద్ధి పరుగులు పెట్టాలంటే 2029లో కూడా కూటమి పార్టీలను ఆదరించాలని విన్నవించారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇంచార్జి దంపూరి భాస్కర్ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, ఏపీ బయో డైవర్సిటీ చైర్మన్ ఎన్.విజయకుమార్, నగర టీడీపీ అధ్యక్షుడు చిన బాబు, యూనిట్ ఇంచార్జ్ అండ్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్ రాయల్ తో పాటు రాష్ట్ర, జిల్లా, వార్డు అధ్యక్ష – ప్రధాన కార్యదర్శిలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
