ఒక ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు”

TEJA NEWS

“ఒక ఫోన్ కాల్… ఒక మెసేజ్… చాలు”

భయం వీడండి… ఫిర్యాదు చేయండి… మహిళల భద్రతకు భరోసా అండగా రామగుండం షీ టీమ్స్….

-పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా….

పెద్దపల్లి / ఒక ఫోన్ కాల్ చేయండి… ఒక మెసేజ్ పంపండి. భయం వీడండి… ధైర్యంగా ఫిర్యాదు చేయండి. మహిళలు, బాలికల భద్రతకు భరోసాగా, అండగా రామగుండం షీ టీమ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

రామగుండం కమిషనరేట్ పరిధిలో మహిళలు,బాలికల భద్రత కోసం షీటీమ్స్ నిరంతరంగా సేవలు అందిస్తున్నాయని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలీస్ శాఖపై,షీ టీమ్స్‌పై నమ్మకం, భరోసాతో మహిళలు,బాలికలు తమపై జరుగుతున్న వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందన్నారు.

రామగుండం కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జోన్‌లో ఒక షీ టీమ్, మంచిర్యాల జోన్ పరిధిలో రెండు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. మహిళలు,బాలికలు, పిల్లలను ఎవరు అయినా వేధిస్తే వెంటనే సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు.

షీ టీమ్ వాట్సాప్ నంబర్: 6303923700
పెద్దపల్లి జోన్ షీ టీమ్: 8712659386
మంచిర్యాల జోన్ షీ టీమ్: 8712659385

అదేవిధంగా డయల్ 100కు కాల్ చేయవచ్చని సూచించారు. మహిళలు,బాలికలు సురక్షిత ప్రయాణం కోసం ట్రావెల్ సేఫ్ యాప్‌ను వినియోగించుకోవాలని కోరారు.

జనవరి నెలలో షీ టీమ్స్ చేపట్టిన కార్యక్రమాల వివరాలు:
జనవరి నెలలో షీ టీమ్స్‌కు మొత్తం 56 ఫిర్యాదులు అందాయి.

వాటిలో 13 ఫిర్యాదులు రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్, డయల్ 100 ద్వారా, ప్రత్యక్షంగా పెద్దపల్లి, మంచిర్యాల షీ టీమ్ కార్యాలయాలకు అందాయి.
43 రెడ్ హ్యాండెడ్ కేసులు డీకాయ్ ఆపరేషన్లలో నమోదు అయ్యాయి.
అందిన 13 ఫిర్యాదులపై:
ఎఫ్‌ఐఆర్ నమోదు– 01, పెటీ కేసులు – 08, కౌన్సిలింగ్ – 04

పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల్లోని ప్రజా ప్రదేశాలు,పార్కులు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో షీ టీమ్స్ డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించి మొత్తం 43 మందిని పట్టుకున్నారు.వీరిపై పెటీ కేసులు నమోదు చేసి, కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రుల సమక్షంలో హెచ్చరించారు.

43 రెడ్ హ్యాండెడ్ కేసుల వివరాలు:
పెటీ కేసులు–02,కౌన్సిలింగ్–35
కౌన్సిలింగ్ నిర్వహించి హెచ్చరించినవి 06
జనవరి నెలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు: పెద్దపల్లి జిల్లా–21,
మంచిర్యాల జిల్లా– 28,మొత్తం–49
హాట్‌స్పాట్ తనిఖీలు:
పెద్దపల్లి జిల్లా 95,మంచిర్యాల జిల్లా 129
మొత్తం–224.

You cannot copy content of this page

Scroll to Top