TEJA NEWS

పల్నాడు జిల్లాలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” కార్యక్రమం

పాఠశాలలు, కళాశాలల సమీపంలోని దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు

ఈ దాడుల్లో పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలను స్వాధీనం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”తో పల్నాడులో పొగాకు, గుట్కా విక్రయాలపై ఉక్కుపాదంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు ఐ.పి.ఎస్ పర్యవేక్షణలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్” కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు 100 గజాల సమీపంలో ఉన్న దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలు, ఇతర నిషేధిత మత్తు పదార్థాల అమ్మకాలపై పోలీసులు క్షుణ్ణంగా సోదాలు జరిపారు. తనిఖీల్లో అనుమతులకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న పొగాకు ఉత్పత్తులు, గుట్కా నిల్వలను COTPA ACT ప్రకారం సీజ్ చేశారు. అక్రమ విక్రయాలు జరుపుతున్న వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు హెచ్చరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు మాట్లాడుతూ, యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల నిల్వలు కలిగి ఉన్నా, వాటిని అక్రమంగా విక్రయించినా ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి దుకాణ యజమానులపై కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సోదాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన పునరుద్ఘాటించారు. ఈ తనిఖీల్లో జిల్లాలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.