TEJA NEWS

పహల్గామ్ బాధిత మహిళల ప్రతీకారానికి చిహ్నమే ఆపరేషన్ సింధుర్ – దొడ్ల వెంకటేష్ గౌడ్

పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపిన విషయం విదితమే. ఈ దాడిలో కేవలం పురుషులను మాత్రమే చంపి మహిళలకు వారి పసుపుకుంకుమలు దూరం చేసారు. ఈ బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు రంగంలోకి దిగిన భారత సైన్యం వారి నుదిటిన ఏ సింధూరాన్నైతే చెరిపేశారని ఉగ్రవాదులు విర్రవీగారో వారి మనుగడనే లేకుండా ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసి విజయవంతంగా ధ్వంసం చేసిన సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మరియు డివిజన్ నాయకులతో కలిసి భారత్ మాతాకి జై, పాకిస్తాన్ డౌన్ డౌన్ నినాదాలతో టపాసులు కాల్చి సంబురాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఉగ్రవాదుల కవ్వింపు చర్యలకు చూస్తూ ఊరుకున్నాం, దాడులు చేస్తున్నా సహించాం.. కానీ కళ్లెదుటే కట్టుకున్న వాళ్లను కాల్చేసి దిక్కున్నచోట చెప్పుకోమంటే ఎలా ఊరుకుంటాం..ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన ప్రతీ మహిళ ప్రతీకారానికి చిహ్నంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ ఆర్మీకి జోహార్లు అని అన్నారు. ఉగ్రవాదుల పేహల్గామ్ దాడికి కౌంటర్గా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధుర్ విజయవంతం అయిన సందర్భంగా ఆల్విన్ కాలనీ లో పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టాం అని తెలియచేసారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, మైనారిటీ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జయ్ హింద్! భారత్ మాతా కి జై!