
ఉగ్రవాదం వెన్ను విరిచేందుకే ఆపరేషన్ సిందూర్.. సాయుధ దళాల ప్రకటన
ఆపరేషన్ సిందూర్పై ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో భారత్ దయాది దేశం దుర్నీతిని చీల్చి చెండాదింది. ఆర్మీ మహిళ అధికారి కల్నర్ ఖురేషీ, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండ్ వ్యోమికా సింగ్తో కలిసి విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిశ్రీ ఈ సమావేశంలో పాక్ నీచత్వాన్ని ఎండగట్టారు.
ఉగ్రవాదులకు పాక్ స్వర్గ ధామంగా మారిందని అన్నారు. బాధ్యతాయుత రీతిలో భారత్ దాడులు చేసిందని అన్నారు. పౌరులకు హాని జరగకుండా పాక్ ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపారు. స్వీయ రక్షణ తమ హక్కు అని కూడా తెలిపారు.
ఈ సందర్భంగా సాయుధ దళాల మహిళా అధికారులు ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. పహల్గాం బాధితులకు న్యాయం చేసేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిపారు. ఉగ్రవాదం వెన్ను విరిచేలా తమ లక్ష్యాలను ఎంచుకున్నట్టు తెలిపారు. మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైనట్టు చెప్పారు. ”పాకిస్థాన్ ఓ క్రమపద్ధతిలో ఉగ్ర వ్యవస్థలను నిర్మించింది. ఉగ్రవాదులకు మత మౌఢ్యం నూరిపోయడం, దాడుల్లో శిక్షణ ఇవ్వడం, లాంచ్‌ప్యాడ్‌ల నుంచి భారత్‌పై ఉసిగొల్పడం తదితర అంశాలతో ఓ సంక్లిష్ట విషవలయం” అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అన్నారు.
నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో తాము పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ఎంచుకున్నట్టు కల్నల్ సోఫియా ఖురైషీ పేర్కొన్నారు. లాహోర్‌కు ఉత్తరాన ఉన్న మురిద్కే ఉగ్రకేంద్రంలో 26/11 ముంబై నిందితులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీలకు ట్రెయినింగ్ ఇచ్చారని పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా మౌత మౌఢ్యం బోధించే కేంద్రాలు, గతంలో భారత్‌పై ఉగ్రవాద ప్రణాళికలకు కేంద్రంగా ఉన్న పాక్ ఉగ్రస్థావాలను టార్గెట్ చేసినట్టు తెలిపారు. బాధ్యతాయుతంగా పౌరులకు ఎలాంటి అపాయం జరగకుండా ఈ దాడులు నిర్వహించినట్టు తెలిపారు.
