Spread the love

రిచ్ మైండ్స్ ఎలిమెంటరీ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెస్టి ఫుడ్ ఫెయిర్ సందర్శించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం,హెచ్ఏయల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రిచ్ మైండ్స్ ఎలిమెంటరీ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెస్టి ఫుడ్ ఫెయిర్ లో పాల్గొన్నారు..

అనంతరం విద్యార్థులు వండిన రుచికరమైన వంటలు తిని కూన శ్రీశైలం గౌడ్ ఆనందించారు..

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…

ముందుగా రుచికరమైన పదార్థాలు తయారుచేసిన విద్యార్థులను అభినందించారు..

విద్యతో పాటు సమసమాజానికి ఉపయోగపడే మంచి వ్యక్తిత్వం కూడ అలవర్చుకోవాలన్నారు..

నైతిక విలువలు,నైపుణ్య అభివృద్ధి పెంపొందించే అంశాలపై దృష్టి సాధించాలన్నారు..

పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అన్ని రంగాలపై అవగాహన కల్పించాలన్నారు..

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మహమ్మద్ మెహబూబ్ అలీ, అకాడమిక్ డైరెక్టర్ మహమ్మద్ బిలాల్, ప్రిన్సిపల్ మంజుల సురేఖ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీర్జా రషీద్ బేగ్, విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు తదితరులు పాల్గొన్నారు..