TEJA NEWS

మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి 31ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామంలో మాజీ సర్పంచ్ సులోచన సాయిలు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవo మరియు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ ముదిరాజ్ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం ఎస్ ఎఫ్ నాయకులు వివిధ కుల సంఘాల నాయకుల సమక్షంలో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరవేశారు అదేవిధంగా స్వీట్లు పంపిణీ చేశారు మాజీ సర్పంచ్ సాయిలు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ స్థాపించిన నాటి నుంచి ప్రజలకు సమాజానికి చేసినటువంటివి పనులను సాధించి విజయాలను గుర్తు చేసుకోవడం జరిగింది గత 30 ఏళ్లుగా ఉద్యమానికి సహకరించినటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరిని పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు.