
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో గోకుల్ ప్లాట్స్ కాలనీ కి ఆర్టీసి బస్సు సర్వీసులు
గోకుల్ ప్లాట్స్ నుండి సికింద్రాబాద్ బస్సు సర్వీస్
గోకుల్ ప్లాట్స్ నుండి మెహిదీపట్నం వరకు బస్సు సర్వీస్ తిరిగి గోకుల్ ప్లాట్స్ కు ప్రయాణం
మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీ కి నూతనంగా ఆర్టీసీ బస్సు సర్వీస్ లను జెండా ఊపి ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సంద్భంగా PAC ఛైర్న్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ చాలా కాలంగా గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు కోరుతున్న విధంగా ఆర్టీసీ బస్సు సర్వీస్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అని , గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసుల చిరకాల కోరిక నెరవేరింది అని ఎన్నో ఏండ్ల కోరిక నేటి తో తిరినది అని , గోకుల్ ప్లాట్స్ కాలనీ వాసులు ,పరిసర ప్రాంత ప్రజలు ఈ చక్కటి సదావకాశంను సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
గోకుల్ ప్లాట్స్ కాలనీ నుండి సికింద్రాబాద్ వరకు ఒక బస్సు సర్వీస్ మరియు మెహిదీపట్నం వరకు మరొక బసు సర్వీస్ నడుచునని మొత్తము రెండు బస్సు సర్వీసులు నడుచునని PAC చైర్మన్ గాంధీ తెలిపారు.ఒక్క రోజు కూడా బస్సు సర్వీస్ అగకూడదని, పేద ,మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు, చిరు వ్యాపారస్థులు నిత్యం ప్రయాణం చేస్తారు అని , ఈ బసు సర్వీస్ లతో వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, సుఖవంతం అని ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయుటలో ముఖ్యభూమిక పోషిస్తుంది అని ,ఆర్టీసీ ప్రయాణము సురక్షితం అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
