
సికింద్రాబాద్,
పేదల వైద్య సేవలకు సహకారం : పద్మారావు గౌడ్
ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్) ను నిరుపేదల వైద్యానికి ఉపకరించేలా కృషి చేశామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన 60 మంది రోగులకు సీ.ఎం.ఆర్.ఎఫ్. ద్వారా మంజురైన చెక్కులను సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు. కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, బీ.ఆర్.ఎస్. నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 60 మందికి సుమారుగా రూ.25 లక్షల విలువజేసే చెక్కులను ఈ సందర్భంగా అందించారు.
