
సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ఐదుగురు రోగులకు సీ.ఎం.ఆర్.ఎఫ్. ద్వారా మంజురైన రూ.8.55 లక్షల విలువజేసె లెటర్ అఫ్ క్రెడిట్ (ఎల్.ఓ.సీ) పత్రాలను చెక్కులను సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన భారంగా మారిన దశలో వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని పద్మారావు గౌడ్ అన్నారు. ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సూచించారు. వైద్య సేవలకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నాని పేర్కొన్నారు. కార్పొరేటర్లు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాలాపేట కు చెందిన గిరిమల్ల దుర్గా రావుకు రూ.2.25 లక్షలు, వారాసిగుడా కు చెందిన పతంగి విట్టల్ రావు కు రూ.రెండు లక్షలు, సితాఫలమండీ కి చెందిన పీ.సూర్యకాంత్ కు రూ.2.20 లక్షలు, నాగార్జున నగర్ కు చెందిన సుంకరి వ్రిశాంక్ కు రూ.లక్ష, రవీంద్రనగర్ కు చెందిన జంగం రేఖకు రూ.1.10 లక్షల ఎల్.ఓ.సీ. పత్రాలను ఈ సందర్భంగా అందించారు. నిమ్స్ ఆసుపత్రిలో రోగులు చికిత్స పొందేందుకు వీలుగా ఈ పత్రాలను అందించామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
