TEJA NEWS

హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న పద్మారావు గౌడ్
• శాంతీయుతంగా ర్యాలీలు నిర్వహించుకొనేందుకు అనుమతించాలని సూచన
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. తార్నాక డైరీ ప్రాంతంలోని హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ జయంతి శోభా యాత్రను ప్రారంభించారు. లాలాపేట, సీతాఫలమండీ, చిలకలగూడా, మోండా మార్కెట్ ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యాత్మికత, అన్నీ విలువల ప్రేరణకు హనుమంతుడు స్పూర్తిగా నిలుస్తాడని అన్నారు. హనుమాన్ జయంతి ర్యాలీలు సాఫీగా నిర్వహించుకొనేలా పోలీసులు సహకరించాలని సూచించారు. యువ నేత కిశోర్ కుమార్ గౌడ్ తో పాటు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.