TEJA NEWS

పాకిస్థానీలు వెంటనే వెళ్లిపోవాలి: DGP

పాకిస్థానీలను వెనక్కి పంపాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. తెలంగాణలో పాకిస్థానీలందరూ వెంటనే ఇండియాను వీడాలని స్పష్టం చేశారు. ఈ నెల 27న వీసాలు రద్దవుతాయని, మెడికల్ వీసాదారులకు ఈ నెల 29 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. అక్రమంగా తెలంగాణలో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, HYDలో 200 మంది పాకిస్థానీలు ఉన్నట్లు తెలుస్తోంది.