
భగవాన్ మహావీరుడు బోధించిన పంచ సూత్రాలు అనుసరించదగినవని, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహావీర్ జయంతి సందర్భంగా జైన్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా భగవాన్ మహావీర్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జైన్ మాతా, గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహావీరుడి బోధనలను అనుసరించి జైన్ సమాజ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మహావీర్ హాస్పిటల్ ద్వారా అనేకమంది పేదలకు అతితక్కువ ధరలకు వైద్యం అందిస్తూ అండగా నిలుస్తున్నారని అన్నారు. KCR నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం లో 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలలకే రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయని విచారం వ్యక్తం చేశారు. తమకు మరింత మేలు జరుగుతుందనే విశ్వాసం తో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆశలను వమ్ము చేశారని అన్నారు. జైన్ సమాజ్ భవన్ నిర్మాణం కోసం BRS ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అద్భుతమైన భవనం నిర్మించాలని అన్నారు. అనంతరం MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ్ అధ్యక్షుడు యోగేష్ జైన్, సుభాష్ జైన్, హిమాన్షు బాప్నా, వినోద్, అశోక్, విమల్ ముత్త, అమిత్ జైన్, మోహన్ లాల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.
