TEJA NEWS

పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం : పటేల్ రమేష్ రెడ్డి

సూర్యాపేట మండలం దాసాయిగూడెం లో మాదన్ హుస్సేన్ ఇంటిలో భోజనం చేసిన పటేల్ రమేష్ రెడ్డి

సూర్యపేట జిల్లా : పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలంలోని ఐదవ వార్డు దాసాయిగూడెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీలో భాగంగా దాసాయిగూడెంలో మాదన్ హుస్సేన్ ఇంటిలో రేషన్ బియ్యం తో వండిన ఆహారాన్ని వారి ఇంటిలో భోజనం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయా..! అని వారి కుటుంబ సభ్యులను అడిగి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఒక పండగ వాతావరణం లో ఉన్నదని కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీను, ముదిరెడ్డి రమణారెడ్డి, కట్కూరి మమతా రెడ్డి, సందీప్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకన్న నాయక్, వల్దాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, తండు శ్రీనివాస్, యాట వెంకన్న, యాట ఉపేందర్, కరుణాకర్ రెడ్డి, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.