TEJA NEWS

ఐకెపి కేంద్రాలను ప్రారంభించిన పటేల్ రమేష్ రెడ్డి

సూర్యపేట జిల్లా : సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో ఐకెపి -1 కేంద్రంను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సంద్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 నెలల కాలంలో 50 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల కోసం పనిచేస్తుందని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా వున్న కాలంలో రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి, ధాన్యం కొనుగోలులో దళారుల పాత్ర లేకుండా చేయడానికి ప్రతి గ్రామంలో ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేసి స్ధానిక పొదుపు సంఘాల మహిళలకు కేంద్రాల నిర్వహణ భాధ్యతలు అప్పగించారని గుర్తుచేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో రెండు, మూడు ఐకెపి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, సన్న,దొడ్డు రకం ధాన్యానికి క్వింటాల్ కు 2320 రూపాయలు మద్దతు ధర నిర్ణయించారని సాన్నాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించారని కాబట్టి గ్రామ రైతులు ఐకెపి కేంద్రానికి తాము పండించిన ధాన్యాన్ని తేమ, మట్టిపెళ్లలు లేకుండా తీసుకుని వచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. ‌ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పిసిసి అధికార ప్రతినిధి ధరావత్ వెంకన్న నాయక్, మాజి ఎంపిటిసి చింతా కేశవులు, సిసి సునీత, తండు శ్రీనివాస్, దాసరి నతాని, దయాకర్, దాసరి హేమలత, సూరారపు మంజుల, రైతులు, తదితరులు పాల్గొన్నారు.