
భక్తి, శాంతి, రక్షణకు మార్గం….అయ్యప్ప శరణం: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
128 – చింతల్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో శ్రీధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భక్తి, శాంతి, రక్షణకు మార్గం అయ్యప్ప శరణమని అన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. అంతకు ముందు స్థానిక హనుమాన్ దేవాలయంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు వరద రాజు, శ్రీశైలం యాదవ్, నరేష్, రాము ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
