TEJA NEWS

ట్రాయ్” కాగ్ సభ్యుడిగా పావులూరు చిట్టిబాబు
** నిరంతర సేవలకు గుర్తింపుతో 10ఏళ్లుగా కొనసాగింపు

తిరుపతి: టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కాగ్ సభ్యుడిగా చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం కృష్ణజిమ్మా పురం గ్రామానికి చెందిన పావులూరు చిట్టిబాబు నియమితులయ్యారు. ఆయన 2015 నుంచి ఈ పదవిలో కొనసాగుతూ నిరంతరం కమ్యూనికేషన్ రంగంలో వేలాదిమంది కస్టమర్లకు చేస్తున్న మెరుగైన సేవలకు గుర్తింపుగా 10వ ఏడాది కూడా ఆయననే నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉత్తర్వులు జారీ చేసాయి. ఈమేరకు శుక్రవారం చిట్టిబాబుకు న్యూ డిల్లీ నుంచి సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ నంద కిషోర్ చౌదరి నుండి ఆర్డర్స్ అందాయి. తనపై ఉన్న నమ్మకం, ప్రజలకు సేవచేసే అవకాశం 10వ సంవత్సరం కూడా రావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని టెలికాం వినియోగదారుల సమస్యల పరిష్కరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ట్రాయ్ కాగ్ మెంబర్ చిట్టిబాబు తెలిపారు. నేటి ఆధునిక సమాజంలో కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు,టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వినియోగదారులకు సదస్సులు, సమావేశాలు నిర్వహించి సమాచార రంగాన్ని బలోపేతం చేయడానకి కృషి చేస్తానని తెలిపారు. ఇదేకాకుండా కేబుల్ ప్రసారాల వ్యవస్థతో పాటు ప్రభట్వరంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్, కార్పొరేట్ టెలికాం కంపెనీస్ నుంచి సేవలు పొందుతున్న కోట్లాదిమంది వినియోగదారులకు కూడా సూచనలు, సలహాల ద్వారా మెరుగైన సేవలను అందించేందుకు కృషి కొనసాగిస్తానని వివరించారు.