TEJA NEWS

పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సీఎం చేతిలో కీలుబొమ్మగా మారారు : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

నగరంలోని బిఆర్ఎస్ భవన్ నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కంచె గచ్చిబౌలి భూమిలో ప్రభుత్వ కుంభకోణాన్ని బట్టబయలు చేస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూపిన ఆధారాలపై కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఎండగట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….

కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు కనీస అవగాహన లేదనేది వారి మాటలను బట్టే అర్థం అవుతుంది.

గతంలో ముఖ్యమంత్రి, మంత్రుల నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే సరిదిద్దేందుకు పార్టీలోని సీనియర్లు, కీలక పదవుల్లో ఉన్నవారు అడ్డుకునేవారు.

గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటే పిసిసి అధ్యక్షులుగా ఉన్న కేశవరావు గారు అనేక మార్లు ప్రభుత్వ నిర్ణయాలను సర్దితే వారని, కానీ నేడు ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వం బదనామవుతున్న పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ నిర్ణయాలను సరిదిద్దకపోగా, సీఎం రేవంత్ రెడ్డి ఆడినట్లు ఆడుతూ కీలుబొమ్మగా మారారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై రేవంత్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్నలను మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ ని అడగడం ఏంటి…?

ప్రభుత్వ కుంభకోణాలను బయట పెడుతున్న మా నాయకులు కేటీఆర్ ని బెదిరించే విధంగా మీరు త్వరలోనే జైలుకు వెళ్తారు అంటూ బెదిరింపులకు పాల్పడం ఏమిటి..? కంచ గచ్చిబౌలి విషయంలో ఎటువంటి కుంభకోణం జరగకపోతే మా ప్రభుత్వంలో ఎటువంటి కుంభకోణం జరగలేదని 400 ఎకరాల వ్యవహారంపై చేత పత్రం విడుదల చేయండి.

గతంలో కూడా ప్రభుత్వం తీసుకున్న అసమర్ధ, అనాలోచితం నిర్ణయాలను బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా నాయకులు కేటీఆర్, హరీష్ రావు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రభుత్వం తప్పించుకున్న ధోరణి అవలంబిస్తూ నేడు బెదిరింపులకు పాల్పడుతుంది.

ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా పార్టీ నాయకులు కెసిఆర్, కేటీఆర్ ది. మా బిఆర్ఎస్ పార్టీది.

400 ఎకరాల భూ కుంభకోణంపై మీకు అవగాహన ఉంటే చర్చ ఎప్పుడు పెడతారు చెబితే టిఆర్ఎస్ పార్టీ విప్ గా చర్చకు నేను వస్తాను..? మీరు సిద్ధమా…?

ప్రభుత్వము బెదిరింపులకు పాల్పడడం చూస్తుంటే చట్టాలు వారి చేతుల్లో ఉన్నట్లు, విచారణాధికారి లేనట్లు తీర్పు వారే చెబుతారు.

అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మాపై, ఆ పార్టీపై అనేకమార్లు విచారించారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు.

కంచ గచ్చిబౌలి విషయంలో ఎటువంటి కుంభకోణం జరగకపోతే సిబిఐ వంటి విచారణ సంస్థలను విచారణ చేపట్టమని ప్రభుత్వం లేఖలు రాయండి. అప్పుడు నీ నిజాయితీ బయటపడుతుంది.

సుప్రీంకోర్టు ఆదేశాలను బేకాతారు చేసి సర్కార్ అరాచకం చేస్తుంది. దీనిని ప్రజలు గమనిస్తున్నారు.

పదివేల కోట్ల నిధుల సమీకరణ పై ప్రభుత్వంలోని ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతున్నారు. పిసిసి అధ్యక్షులు ఈ నిధులను రుణమాఫీ కోసం వినియోగిస్తున్నట్లు చెబుతుండగా, రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ఈ నిధులు అనడంలో అసలు ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనేది ప్రజలకు తెలియజేయాలి.

మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తోక ముడుచుకొని పోయిర్రు. ప్రభుత్వం ఎంతలా దిగజారింది అంటే…? పీకల్లోతుల్లో ఇరుక్కుపోయారు. వారి పార్టీని వారే నమ్మే పరిస్థితిలో లేరు.

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ సూపర్ సీఎంగా అవతరించారు. ముఖ్యమంత్రి ని నమ్మలేక ప్రభుత్వం చేసే తప్పులను సరిదిద్దుతున్నారా…? సవరిస్తున్నారా అనేది ప్రజలకు తెలియజేయాలి.

గతంలో కేసీఆర్ ఆస్తులను పరిరక్షించి, పెంచి రాబోయే తరాలకు అందిస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ ఆస్తులను అమ్ముకుంటూ ఆస్తులను కూడా పెట్టుకుంటున్నారు.

కేటీఆర్ ఫార్మాసిటీ ఏర్పాటుకై 17వేల ఎకరాలను సేకరిస్తే, మేము అధికారంలోకి రాగానే రైతుల భూములను తిరిగి వారికే అప్పగిస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత రియల్ ఎస్టేట్ అందజేస్తున్నారు ముఖ్యమంత్రి .

ఆర్టీఐ ద్వారా గతంలో రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రియల్ ఎస్టేట్ దందా చేసినరు.

ఇప్పుడు అధికారికంగా ప్రభుత్వపరంగా ప్రజల భూములను కొల్లగొడుతున్నారు. దీనిని ఆధారాలతో ప్రశ్నిస్తే కేటీఆర్ ని, హరీష్ రావు ని భయపెట్టే ధోరణిలో పీసీసీ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్నారు.

పదివేల కోట్ల రూపాయల నిధుల సమీకరణకై 170 కోట్లను కమీషన్ ఏజెంట్ కి ఇచ్చినామని చెబుతుండడం చూస్తుంటే ప్రభుత్వం ఎంతలా దిగజారిందో తెలుస్తుంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా పదివేల కోట్ల రూపాయలు టీజీఐఐసీకి ఐసిఐసిఐ బ్యాంకు ద్వారా వచ్చినట్లు మా నాయకులు చెప్పగానే మేము ఎటువంటి మాటుకే చేయలేదని ఆగమేఘాలపై బ్యాంకు స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా మాటుకే చేయకపోతే అసెంబ్లీ సాక్షిగా మా పార్టీ తరఫున అడిగిన ప్రశ్నకు 400 ఎకరాల భూమి తాకట్టు పెట్టి పదివేల కోట్ల రూపాయలు సమీకరించామని మీరు చెప్పిన మాట అబద్దామా అనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం…

ఒకరేమో 400 ఎకరాల భూమి విలువ టీజీఐఐసీ జీవో ఎం.ఎస్.నెంబర్ 54 ద్వారా75 కోట్లు అని చెబుతుంటే, మంత్రి శ్రీధర్ బాబు మాత్రం ఆ భూమి విలువ 52 కోట్లు అని చెబుతుండడం…. ఇవన్నీ గమనించిన కేటీఆర్ స్పష్టంగా ఆధారాలతో ప్రభుత్వ భూ కుంభకోణాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

దీనిపై శ్వేత పత్రం విడుదల చేయండి లేదా విచారణను కోరుతూ చర్ల సంస్థలకు లేఖ రాయండి.

ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా ఉంది.

రాష్ట్రంలోని ఒక బిజెపి ఎంపీ, సీఎంకి సహకరిస్తున్నారు. యావత్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బిజెపి – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలా నడుస్తుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలపై ఏ చేర్చకైనా మేము సిద్ధం. నీకు దమ్ము ధైర్యం ఉంటే విచారణను కోరండి. మీ నిజాయితీని నిరూపించుకోండి.