TEJA NEWS

పెండింగ్ బిల్లులు చెల్లించండి: మాజీ సర్పంచ్ ల సంఘం డిమాండ్

హైదరాబాద్:
పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులతో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.

రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాద య్యగౌడ్ మాట్లాడుతూ..

పెండింగ్ బిల్లులు రాక సర్పంచ్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని చెప్పారు. ఈ రోజు, రేపు అంటూ బిల్లుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు విడుదల చేయకపోగా రేవంత్ ప్రభుత్వం మాజీ సర్పంచ్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని దుయ్యబట్టారు.

పెండింగ్ బిల్లుల కోసం సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసినా ఫలితం కానరావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులను విడుదల చేసేంత వరకు ప్రతీ రోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ లో సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి, నాయకులు పాల్గొన్నారు.