ప్రజలు ఎప్పటికీ మరువని నేత మన వై.యస్. రాజశేఖర్ రెడ్డి

TEJA NEWS

ప్రజలు ఎప్పటికీ మరువని నేత మన వై.యస్. రాజశేఖర్ రెడ్డి

తండ్రి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తున్న వై.యస్. జగన్మోహన్ రెడ్డి.

వైయస్ఆర్ 77వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నేత “డా: వై.యస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి” వేడుకలను కోవూరు మైధిలి సెంటర్ నందు రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించిన కోవూరు వైసీపీ నాయకులు.అనంతరం వారు మాట్లాడుతూ.. మహానేత ఎంతోమంది గుండె చప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఎంతోమందికి గుండె ఆపరేషన్ చేసిన పునర్జన్మ ఇచ్చినటువంటి మా రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడు అలాగే జల యజ్ఞం పేరుతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశించిన మహనీయుడు ఆయన తీసుకొచ్చిన 108 అయితేనేమీ, 104 అయితేనేమి, ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా కొనసాగిస్తున్నారంటే ఆయన మీద ప్రజలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు అటువంటి నాయకుడికి జన్మదిన వేడుకలు చేయడం చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు.

తండ్రి ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029లో ఆయన ముఖ్యమంత్రి గా చేసుకుందామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసిపి యువజన విభాగ అధ్యక్షులు నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి, వైసిపి కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి, జడ్పిటిసి కవరగిరి శ్రీలత, సేవాదళ్ అధ్యక్షులు గాజుల మల్లికార్జున్ రావు, చెంచు రెడ్డి, తురక భాస్కర్, మావులూరు వెంకటరమణారెడ్డి, శ్యామచార్యులు, మీరా రెడ్డి, భీమ తాటి శ్రీధర్, జెట్టి శ్రీనివాసులురెడ్డి, కిషోర్ రెడ్డి, కవరగిరి ప్రసాద్, గుణ్ణం జనార్ధన్, ఈద జాషువా, సుధాకర్ రెడ్డి, జ్యోతి, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు*..

You cannot copy content of this page

Scroll to Top