
ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి
ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలతో పాటు అమరావతి రైతుల కలలు నెరవేరనున్నాయని మాజీ కేంద్రమంత్రివర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సర్కారు నేతృత్వంలో రాజధాని అమరావతిని పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారని అన్నారు
రాజధాని అమరావతి
పునః ప్రారంభానికి విచ్చేసిన సుజనా చౌదరి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
వైసీపీ హయాంలో రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేసిందన్నారు.
రానున్న ఐదేళ్లలో ప్రధాని మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి మహానగరంగా అభివృద్ధి చెంది, ప్రగతి పదంలో పరుగులు పెడుతుందని సుజనా చౌదరి ఆకాంక్షించారు.
