Spread the love

పేట మెడికల్ ల్యాబ్ & ఎక్స్_రే టెక్నీషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా షేక్.కరిముల్లా(sk)

చిలకలూరిపేట ల్యాబ్ అండ్ ఎక్స్-రే అసోసియేషన్ కార్యవర్గ సమావేశం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పక్కన, సిటీ ల్యాబ్ అండ్ ఎక్స్-రే నందు శుక్రవారం జరిగింది. అధ్యక్షలు ఎస్.కె. కరిముల్లా, కార్యదర్శి వి. చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చిలకలూరిపేట పట్టణంలోని ల్యాబ్ నిర్వాహుకులందరి సమస్యల పరిష్కారం, ల్యాబ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ,యూనియన్ బలోపేతం, సభ్యత్వ నమోదు, వ్యక్తిగత భీమా, ఐడి కార్డ్స్ వంటి పలు అంశాలపై మాట్లాడం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణంలోని సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్స్, నూతన ల్యాబ్ టెక్నీషియన్స్ పాల్గొన్నారు.