TEJA NEWS

జగన్ ది ముమ్మాటికీ అధికార దాహమే

** కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన వైఎస్సార్ వారసులు

** కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ మహిళా నేత సుంకర పద్మశ్రీ

తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది ఇప్పటికీ ముమ్మాటికి అధికార దాహమే అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ మహిళా నేత సుంకర పద్మశ్రీ ఒక ప్రకటనలో ఆరోపించారు. దివంగత వైఎస్సార్ జయంతిని పురష్కరించుకుని సుంకర పద్మశ్రీ ఘన నివాళులు అర్పించి కాంగ్రెస్ మీద ఉన్న తన గౌరవం, అభిమానాన్ని ఆ ప్రకటనలో వెల్లడించారు. అధికార దాహంతో తన తండ్రి మరణం తరువాత తనకు సీఎం పదవి ఇవ్వలేదన్న ఆక్రోశంతో వైఎస్సార్ మరణ సానుభూతిని అస్త్రంలా చేసుకుని కాంగ్రెస్ పార్టీ మీద , కాంగ్రెస్ అగ్ర నాయకత్వం మీద…. ముఖ్యంగా సోనియా గాంధీ మీద నీలాపనిందలు వేసిన స్వార్తుడు జగన్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న క్యాడర్ కు అప్పట్లో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ఓటు బ్యాంకు ను జగన్ మెహన్ రెడ్డి దోచుకెళ్ళాడని తెలిపారు.
ఇంకో వారసురాలు షర్మిల రాచరికం అన్నట్టు ఆ రోజు వాళ్ళ అన్నకు పదవి ఇవ్వలేదని వారి తండ్రి మరణ సెంటిమెంటు ను అడ్డుపెట్టుకుని సోనియా గాంధీ మీద , రాహుల్ గాంధీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆంధ్ర… తెలంగాణ లో కాంగ్రెస్ క్యాడర్ ను మాయ చేసే ప్రయత్నాలు అన్ని చేసిందని విమర్శించారు. ఈరోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అనే పోస్టును ఒక హోదా లాగ మాత్రమే వాడుతూ చేయాల్సిన చిల్లర పనులు అన్ని చేసి , ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, కడప, కర్నూల్, నెల్లూరు మొదలగు చోట్ల ఉన్న అభిమానం అనే ఆస్తులను దొంగిలించే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు చేశారు. కర్నూల్ డీసీసీ కార్యాలయాన్ని సొసైటీ కింద రిజిస్టర్ చేసి ఏ విధంగా తనఖా పెట్టి కోట్ల రూపాయల ఋణం తీసుకోవాలి అని షర్మిల , షర్మిల టీం ప్రయత్నించిందో మనం అందరం చూసామని సుంకర పద్మశ్రీ పేర్కొన్నారు.


ఏది ఏమైనా వైఎస్సార్ సెంటిమెంటు మీద జగన్ మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చిన కేవలం 5ఏళ్లలో ప్రజలలో తీవ్ర అసహనం తీసుకువచ్చి ప్రజా అభిమానానికి దూరం అయ్యాడు జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను సర్వ నాశనం చేస్తూ ధన దాహంతో రాజకీయ పరిజ్ఞానం లేకుండా షర్మిల తిరుగుతున్నదని పేర్కొన్నారు. వీరిద్దరి నిర్వాకం చూస్తూ వైఎస్సార్ ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది .. ఒకటి మాత్రం నిజం .. కాంగ్రెస్ పార్టీలేకపోతే వైఎస్సార్ లేరు… కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన స్వేచ్ఛ తో వైఎస్సార్ ఒక మహా నాయకుడు అయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ క్యాడర్ , కాంగ్రెస్ నాయకులు ఆ రోజు వైఎస్సార్ ను లీడర్ చేశారు. వైఎస్సార్ కూడా పార్టీ కోసం అంతే నిలబడి కష్ట పడ్డారని….వైఎస్సార్ జయంతి సందర్బంగా నివాళులు అర్పిస్తూ … ఈ ప్రకటన ప్రజల్లోకి వెళ్లాలని పద్మశ్రీ విన్నవించారు.