Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని PNR EMPIRE కాంప్లెక్స్ లోని వాసన్ ఐ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరిగిన “FREE GLAUCOMA SCREENING PROGRAMME” క్యాంప్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి ర్యాలీ తీసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, గ్లకోమ అనేది చాలా ప్రమాదకరం అని, నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, అలాంటి వారికోసమే ఈ రోజు నుండి వాసన్ ఐ కేర్ సంస్థ వారు గ్లకోమా పరీక్షలు అన్ని శాఖల్లో ఈ నెలాఖరు వరకు ఉచితంగా చేయించుకోటానికి అందుబాటులో ఉన్నాయి అని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని చెప్పడం జరిగింది, అలానే వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్లకు, ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇక్కడి ఇన్చార్జి డాక్టర్ రవి కుమార్, గ్లకోమ డాక్టర్ మయూరి తదితరులు పాల్గొన్నారు.