
మనసు లోతుల్లో ఉన్న భావాన్ని వ్యక్తీకరించే ప్రక్రియే కవిత్వం
ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవం
వనపర్తి
సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ మనసు లోతుల్లో దాగివున్న భావాన్ని,అనుభవాన్ని,బాధను,లోతైన గాథల్ని వ్యక్తీకరించేందుకు అనుసరించే ఒక ప్రక్రియ కవిత అని వివరించారు.హృదయంలోని భావాలను అర్థవంతంగా స్పూర్తివంతగా ప్రకటించే సామర్థ్యం కొందరికి మాత్రమే ఉంటుందనీ అలా తమదైన శైలిలో కవితలు రచించి పాఠకులను ఆకట్టుకున్న కవులు మన జిల్లాలో ఎంతో మంది ఉన్నారని శంకర్ గౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో దాదాపు ఇరవై మంది కవులు కవితాగానం చేశారు.వీరిని నిర్వాహకులు శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కవులు జనజ్వాల శివరాజలింగం, బైరోజు చంద్ర శేఖర్,వెంకటయ్య,సత్తార్,బాబుగౌడ్,ఉప్పరి తిరుమలేశు,డా.తుర్పింటి నరేష్ కుమార్ ,బుచ్చిబాబు,వీరాచారి,కొత్తకాపు నారాయణ రెడ్డి ,శివలింగం, డా.అనంతప్ప,డా.రాములు,రాంరెడ్డి,స్వామి తదితరులు పాల్గొన్నారు.
