
కవులు సామాజిక చైతన్యం కోసం రచనలు చేయాలి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ :,*
వనపర్తి
కవులు సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ *రావుల గిరిధర్ అన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో వనపర్తికి చెందిన ప్రముఖ పద్య కవి ఆకుల శివరాజలింగం రచించిన కొన్ని పుస్తకాలు ఎస్పీ * చదివి పరవశించి ఆనందంతో కవి ని శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ… సాహిత్యం సమాజ హితాన్ని కోరుతుంది కాబట్టి కవులు సమాజాన్ని చైతన్య పరిచే రచనలు చేయాలని కోరారు. ఆకుల శివరాజలింగం దాదాపు మూడున్నరు దశాబ్దాలపాటు హిందీ భాషోపాధ్యాయులుగా పనిచేశారని తన విశ్రాంత సమయంలో అటు విద్యార్థులకు ఉపయోగపడే రచనలే గాక తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో చక్కటి రచనలు చేశారని కొనియాడారు. సంగీతంలోను మంచి ప్రవేశమున్న ఆయన పలు భజన కీర్తనలు,హరికథలు రాసి తెలంగాణ వాగ్గేయకారుడుగా బెంగుళూరు తెలుగు సంఘం వారిచే అవార్డ్ ను అందుకున్నారని తెలిపారు. ఆకుల శివరాజలింగంను స్పూర్తిగా తీసుకొని వర్తమాన కవులు రచనలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, ఉమామహేశ్వర భజన మండలి సభ్యులు, టి, వెంకట్ రాములు, వై, నగేష్ యాదవ్, నరేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
