TEJA NEWS

మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై పోలీస్ సంఘం సీరియస్

రామగిరి:
రామ‌గిరి ప‌ర్య‌ట‌న‌లో మాజీ ముఖ్య‌మంత్రి,వైసిపి అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను పోలీసు అధికారుల సంఘం ఖండించింది.

పోలీసులను బట్టలూడదీసి నిలబెడతామనడం గర్హనీయమని పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు విమర్శించారు.

మాజీ సిఎంగా జగన్ చేసిన‌ వ్యాఖ్యలపై సభ్యసమాజం ఆలోచించాలన్నారు. బట్ట లూడదీసి నిలబెట్టడానికి ఇదేమైనా ఫ్యాషన్ షోనా? తీవ్ర ఒత్తిడి ఉన్న మాపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. అన్నారు.

ఈ వ్యాఖ్యల్ని జగన్ తక్షణమే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలి. లేదంటే న్యాయపోరాటం చేస్తాం” అని శ్రీనివాసరావు హెచ్చరించారు.